కోవిడ్ రోగులకు చికిత్స పూర్తిగా ఉచితంగా అందించాలి… స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్
రాష్ట్రంలో కోవిడ్ హాస్పిటలుగా గుర్తింపు పొందిన ప్రతీ హాస్పిటల్లో కోవిడ్ రోగులకు చికిత్సను పూర్తిగా ఉచితంగా అందించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
కోవిడ్ కు సంబంధింజి 104 హెల్ప్ లైన్ నంబరు ఏకీకృత వ్యవస్థగా పనిచేయాలని సింగిల్ డెస్టినేషన్ నంబరుగా ఉండాలని అధికారులకు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద కానీ కోవిడ్ కేరం కింద కానీ ఎంపానెల్మెంట్ పొందిన హాస్పిటళ్ళలో ఈ చికిత్స పూర్తిగా ఉచితంగా అందించాలన్నారు.
ఎంపానల్మెంటు పొందని ప్రయివేటు హాస్పిటళ్ళలో సైతం కోవిడ్ చికిత్సకు రేటు కార్డులు నిర్ణయించడం జరిగిందని అన్ని ప్రైవేటు హాస్పిటళ్ళు తప్పనిసరిగా ఆ రేటు కార్డుల ప్రకారమే రుసుము వసూలు చేయాలని, అందుకు భిన్నంగా ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా కఠినమైన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రస్తుతం నెలకొన్న పాండమిక్ వండి విపత్కర పరిస్థితుల్లో అందరూ బాధ్యతగా మసులుకోవాలని జగన్ అన్నారు.
నిబంధనలు అతిక్రమించిన సందర్భాలలో అవసరమైతే హాస్పిటల్ లైసెన్సులు సైతం రద్దు చేసి కేసులు పెట్టేందుకు వెనుకాడవద్దని అధికారులకు జగన్ దిశానిర్దశం చేశారు.