జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం..
అసెంబ్లీలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన
జర్నలిస్టులకు వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఒక్కొక్కరి మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ కి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
2021 -22 సంవత్సరం అక్రిడేషన్ కార్డుల ఆధారంగా స్థలాలు పంపిణీ ఉంటుందని స్వష్టం చేసిన ప్రభుత్వం.
రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ నుంచి తమకు సమాచారం అందిందని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.