2021 ఆర్ధిక వృద్ధి రేటు లక్ష్యం 6 శాతానికి పైనే అంటున్న చైనా.
6.8 శాతం పెరుగనున్న చైనా రక్షణ శాఖ బడ్జెట్.
2021 సంవత్సరానికి గాను 6 శాతానికి పైనే ఆర్ధి వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయనున్నట్లు చైనా ప్రిమియర్ లీ కేకియాంగ్ ప్రకటించారు.
ఈ రోజు బీజింగ్ లో జరిగి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ లో ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
2021 లో చైనా అనేక సవాళ్ళను ఎదుర్కోనున్నట్లు ఆయన ఈ సందర్భంలో పేర్కొన్నారు.
అయితే ఆ సవాళ్ళ కారణంగా దీర్ఘ కాలిక సత్ఫలితాలు అందించ గల తమ మౌలిక ఆర్ధిక ప్రమాణాలలో ఎటువంటి మార్పు ఉండబోదని ఈ సందర్భంగా కేకియాంగ్ తెలియజేశారు.
చైనా వృద్ధి రేటు 2021 లో 8.1 శాతంగా ఉండనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి జనవరిలో ప్రకటించింది.
కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా అవలంబించిన లాక్డౌన్ కారణంగా గత సంవత్సర మొదటి త్రైమాసికంలో చైనా ఆర్ధిక వృద్ధి 6.8 శాతం క్షీణించినప్పటికి, 2020 సంవత్సరం మొత్తానికి ఆర్ధిక వృద్ధి 2.3 శాతానికి పుంజుకుంది.
అంతేగాక 2021 లో చైనా రక్షణ శాఖపై 209 బిలయన్ల అమెరికన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం గత సంవత్సర ఖర్చుతో పొలిస్తే 6.8 శాతం అధికం.