ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు.
షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే ప్లవ నామ సంవత్సరంలో ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో కళకళలాడాలని, ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాని ఈ సందర్భంగా ఆయన తెలియజేసారు.