మంత్రి సిదిరి అప్పలరాజుపా అడ్వకేట్ ఫిర్యాదు
రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి సిదిరి అప్పలరాజుపై మైలవరం పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ భూక్యా మల్లికార్జున రావు ఫిర్యాదు చేశారు.
ఎన్440కే కొత్తరకం వైరసం పుట్టిందని, ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమని మంత్రి అప్పలరాజు చెప్పడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారని మల్లికార్జున రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వైరస్ అంత ప్రమాదకారి కాదని సీసీఎండీ పరిశోధనలో తేలిందని, మంత్రి పదవిలో ఉండి ప్రజలకు ఆందోళన కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసిన మంత్రి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.