పెళ్ళి చేసినందుకు రూ. 2 లక్షలు జరిమానా
రూ. 2 లక్షలు జరిమానా కొరడా ఝుళిపించింన అధికారులు
శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కానీ కొంతమంది పెళ్ళిళ్ళ పేరుతో 20 మందికి పర్మిషన్ కావాలి అంటూ చెప్పి 200కు పైగా బంధువులతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
అధికారులు కరోనా నియంత్రణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇలాంటి వారి వల్ల కేసులు పెరుగుతూనే వస్తున్నాయి.
ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం, ఈ నేపథ్యంలో పాతపట్నం మండలం చంద్రయ్యపేట (సీది) గ్రామంలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పెళ్ళికి 2 లక్షలు జరిమానా విధించారు పాతపట్నం తహశీల్దార్, ఎస్ఐ, అధికారులు.