బీజాపూర్ ENCOUNTER లో 22 మంది జవాన్లు బలి!
ఛత్తీస్ గఢ్ అడవిలో అలజడి.
ఒక మహిళా మావోయిస్టు హతం.
బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు పంజా విసిరారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై విరుచుకుపడ్డారు తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జొన్నగూడ గ్రామ సమీప అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 24 మంది జవాన్లు మరణించగా, పోలీసులు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది.
కాల్పుల ఘటనపై జిల్లా యస్పి, డిజిపి సమీక్షించారు.
రెండు హెలీకాఫ్టర్లు పంపి మృతదేహలను, గాయపడ్డ జవాన్లను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
కాని ఘటనా స్థలంలో ఎదురు కాల్పులు కొనసాగుతుండటంతో హెలీకాఫ్టర్ లాండింగుకు ఇబ్బంది కలిగి సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడింది.
– కమలోచన్ కశ్యప్, జిల్లా యస్పి:
శుక్రవారం రాత్రి నుండి బీజాపూర్, సుక్మా జిల్లాల నుంచి డీఆర్జీ, యస్టియఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా ప్రత్యేక బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల ఇలాకాలో యాంటినక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ఈ ఆపరేషన్లో భాగంగా బీజాపూర్ జిల్లా తెర్రం నుండి 760, ఊసూర్ నుండి 200, పామెడ్ నుండి 195, సుక్మా జిల్లా మినప నుండి 483, నర్సాపురం నుండి 420 మంది జవాన్లు బీజాపూర్, సుక్మా జిల్లాల అడవులను జల్లెడ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం సుమారు 12 గంటల సమయంలో సుక్మా- బీజాపూర్ జిల్లాల సరిహద్దులో సుక్మ జిల్లా జేగురుగుండా పోలీసు స్టేషన్ పరిధిలోని జోనగూడ గ్రామ సమీపంలో మావోయిస్టు పార్టీ PLGA ఎదురు పడటంతో ఇరువైపులా కాల్పులు చోటు చేసుకున్నాయి.
నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ ఎదురు కాల్పుల్లో తొలతకోబ్రా బలగంలో ఒక జవాన్, బస్తరీయ్ యస్టియఫ్ కు చెందిన జవాన్లు ఇద్దరు, డీఆర్జీ బలగానికి చెందిన ఇద్దరు జవాన్లు, మొత్తం ఐదుగురు జవాన్లు అమరులైయ్యారు, మరో పన్నెండు మందికి గాయాలయ్యాయి.
ఘటనా స్థలంలో ఓ మహిళ మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే అటు మావోయిస్టులకు కూడా భారీనస్టం కలిగినట్లుగా తెలుస్తుంది.
టాస్క్ఫోర్స్ అధికారి, ఆఫీస్ రూం, పోలీసు ముఖ్యకార్యాలయం నుండి పర్యవేక్షణలో గాయాలపాలైన జవాన్లను ఆసుపత్రికి తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరిపేందుకు ప్రయత్నించారు.
అయితే బీజాపూర్ SP ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత 15 మంది జవాన్లు అడవిలో చిక్కుకున్నట్టు తేలింది.
తొలత వారు మావోయిస్టుల చెరలో ఉన్నట్టు అనుమానించారు. చివరకు తప్పిపోయిన జవాన్ల మృతదేహాలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన బెటాలియన్ ఈ దాడిలో పాల్గొన్నట్టు, కనీసం 700 మందికి పైగా ఈ బెటాలియన్లో ఉన్నట్లు తెలుస్తోంది.