గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గొహత్యలు ఆపాలని, అక్రమ కబేళాలు మూసివేయాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్ ప్రచారం.
ఏప్రిల్ 1న NTR మైదానంలో నిర్వహించే గో మహాగర్జన- భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రచారం చేస్తూ గోమహా గర్జన ప్రచార రథం ప్రారంభమయింది.
ఈ గోమహా గర్జన రథం భాగ్యనగర్ నుండి బయలుదేరి కామారెడ్డికి చేరుకోగా వారికి అక్కడ బీజేపీ కామారెడ్డి శాఖ తరుపున స్వాగతం పలుకారు.
ఈ సందర్భంగా యాత్ర ప్రముక్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు శంకర్ పురోహిత్ మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వచ్చేనెల 1వ తారికు భాగ్యనగర్ లో నిర్వహించే భహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హాజరు కావాలని కరపత్రాలు, స్టికర్స్ ద్వారా ప్రచారము నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి, పీఠాధిపతులు సైతం పాల్గొంటారని అన్నారు.
గో హత్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునిరెత్తనట్లు వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రములోని కబేళాలు మూసివేసేంత వరకు ఉద్యమిస్తామని, గోహత్య నిషేధ చట్టాన్ని రాష్ట్రంలో కఠినంగా అమలు పరచాలని డిమాండ్ చేశారు.