మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి – చల్లా జ్యోతి ధర్మారెడ్డి గారు
మహిళల అన్ని రంగాల్లో ముందు ఉండాలనీ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సతీమణి శ్రీమతి చల్లా జ్యోతి గారు అన్నారు..
సోమవారం పరకాల పట్టణంలో వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో చల్లా జ్యోతి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు..
ఈ సందర్భంగా చల్లా జ్యోతి గారు మాట్లాడ్తు మహిళలు అన్నిరంగాల్లో ముందు ఉంటు, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ అందరితో పాటు సమానంగా పోటీ పడాలని ఆకాంక్షించారు.
అలాగే ప్రతి మహిళ సేవ కార్యక్రమాల్లో సైతం ముందు ఉండాలని ఈ సందర్భంగా ఆమే అన్నారు.
ఆడ పిల్లను అంటూ దిగులు చెందకుండా ఆడ పులిలా ఈ లోకానికి నీవేంటో నిరూపించుకోవాలని, తోటి మహిళల్లో వెలుగులు నింపుతూ నీవెంటో ప్రపంచానికి తెలియజేయాలి అని అన్నారు.
ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చల్లా జ్యోతి గారిని సన్మానిచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పరకాల సబ్ రీజిస్టార్ సునీత, పరకాల ఎంపీపీ స్వరలత, నడికూడా ఎంపీపీ అనసూర్య, నడికూడా ఎంపీపీ కోడెపాక సుమలత, గౌరవ కౌన్సెలర్లు, మహిళా ప్రజా ప్రతినిధులు, ఇతర మహిళలు పాల్గొన్నారు.