కొత్తపల్లి రైలు ఢీకొని వివాహిత మృతి
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని ఓ వివాహిత మృతి చెందింది.
మృతురాలు కొత్తపల్లి గ్రామానికి చెందిన నౌగాపు శారధ(28)గా గుర్తింపు. ఆమెకు భర్త నౌగాపు జానకిరావు తో పాటు మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు.
శ్లీకాకుళం జిల్లాలో మరో ఘటనలో కవిటి మండలం జమీందారి పుట్టుగ సమీపంలో జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలు పాలైన బండారు కృష్ణమూర్తి(72)ని సోంపేట ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన పై ఎస్సై అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.