చింతలూరులో యువతి ఆత్మహత్య ప్రయత్నం
తూర్పుగోదావరి జిల్లా. కొత్తపేట నియోజకవర్గం, ఆలమురు మండలం, చింతలూరులో యువతి ప్రేమించి మోసపోయి ఆత్మహత్యకు ప్రయత్నంచింది.
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన నేలపూడి సత్య నరేష్ అనే యువకుడిని ప్రేమించింది.
నరేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది.
స్థానిక ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిజిహెచ్ ఆసుపత్రికి తరలించారు.
ఆ యువతికి ఎక్కువగా ఫిట్స్ రావడంతో 12 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు తెలిపారని యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు.