ప్రకాశం బ్యారేజ్‌పై భారీగా పోలీసుల మోహరింపు.
మహిళా దినోత్సవం నేపథ్యంలో అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్న మహిళలను అడ్డుకున్న పోలీసులు.
ప్రకాశం బ్యారేజ్‌పై సామాన్యుల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.
రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ మహిళా రైతులను అడ్డగిస్తున్నారు.
పోలీసుల తీరుపై అమరావతి రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా రైతులను అడ్డుకోవడంపై నిరసనగా మహిళలు బ్యారేజ్‌పై కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు.
దీంతో వెంటనే పోలీసులు మహిళా రైతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మహిళల అరెస్ట్‌లు జరుగుతున్నా తమ పనులు చూసుకుంటారా అంటూ బ్యారేజ్‌పై వెళ్తున్న వాహనదారులపై మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలను అరెస్ట్ చేసిన విధానం… తోపులాట పేరుతో మహిళా రైతులను గాయపరచారంటూ మండిపడుతున్నారు.
మహిళా దినోత్సవం రోజు మహిళలకు ఈ ప్రభుత్వం అరెస్టులను బహుమతిగా ఇచ్చిందని రైతులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
