జగన్ తోనే సంక్షేమం… తోట పృధ్వీ..
పేదలకు ప్రభుత్వ పథకాలు…
మునిసిపాలిటీ అభివృద్ధికి అవకాశం…
వైయస్ఆర్సీపి చైర్మన్ అభ్యర్థి రాణి ప్రచారం…
మండపేట:- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని మండపేట వైయస్ఆర్సీపి చైర్మన్ అభ్యర్థి పతివాడ నాగ దుర్గా రాణి పేర్కొన్నారు.
పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పోతంశెట్టి ప్రసాద్ కు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు.
ఆమెకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ప్రతిచోట మహిళలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా తోట పృధ్వీ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలను అందరికీ అందిస్తున్నారని పేర్కొన్నారు.
తమ పార్టీకి అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు వీలుగా ఉంటుందని ఈ సందర్భంగా తోట పృధ్వీ స్పష్టం చేశారు. అధికార పార్టీ కౌన్సిల్ పగ్గాలు చేపడితే ఆయా పట్టణాలు అభివృద్ధి చెందుతాయని, నిధులు ఎక్కువగా వచ్చేందుకు వీలు ఉంటుందని ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని మార్పుతీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాన్ని సుందరంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు సహకారంతో అభివృద్ధి సాధ్యమని తోట పృధ్వీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపి నాయకులు కొమ్ము రాంబాబు, షేక్ అలీ ఖాన్ బాబా, y వెంకన్న బాబు, దాసరి సత్యనారాయణ, తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.