కృష్ణాజిల్లా , నందిగామ:- కృష్ణా జిల్లాలోని పెండ్యాల గ్రామ సచివాలయంలో తోటి మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేస్తున్న సచివాలయ ఉద్యోగి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న మహిళా ఉద్యోని ప్రేమిస్తున్ననంటూ వేధింపులకు గురి చేసాడు తోటి ఉద్యోగి కిషోర్.
గత కొంత కాలంగా కిషోర్ అనే పంచాయతీ సెక్రెటరీ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు సదరు మహిళా ఉద్యోగి.
కిషోర్ స్వగ్రామం కంచికచర్ల మండలం కీసర గ్రామం, అయితే గతంలో కూడా కిషోర్ పై ఇటువంటి ఆరోపణలే రాగా, అప్పుడు కంచికచర్ల పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికి కిషోర్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు కనిపించడంలేదంటున్నారు ప్రజలు.
తాజాగా తమకు అందిన ఫిర్యాదు మేరకు కిషోర్ పై కేసు నమోదు చేసి నిందితుడు రమేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఏస్సై లక్ష్మి తెలియజేసారు.