డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి…. వి జి ఆర్ నారగోని.
ఖమ్మం మార్చ్ 5: తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక త్యాగాలు చేసిన నేత నిజాయితీగల డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జనత రాజకీయ ఫ్రంట్ చైర్మన్ వి జి ఆర్ నారగోని పిలుపునిచ్చారు.
శుక్రవారం పలు ప్రజా సంఘాలు, కులసంఘాల నాయకులు ఖమ్మంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో తొలుత మాట్లాడారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పోరాడే డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని గెలిపించి శాసనమండలికి పంపిస్తే ఆయనకు తెలంగాణ ప్రజానీకం న్యాయం చేసిన వారవుతారని అన్నారు.
ఇతర పార్టీల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తమ తమ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసుకున్న డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి రెండో ప్రాధాన్యత ఓటు వేయడం మరువకూడదన్నారు.
సమస్యల పట్ల ప్రాంతాల పట్ల సమగ్ర అవగాహనతో పాటు ప్రశ్నించే గుణం పోరాడే తత్వం ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్ గారి ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.
బహుజన జేఏసీ చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు గారు మాట్లాడుతూ మన ఓటు – మన ఆయుధమని ఈ ఆయుధం ద్వారానే మనం రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు అన్నారు.
తెలంగాణ ఇంటి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బత్తుల సోమయ్య మాట్లాడుతూ ….పట్టభద్రులైనటువంటి మేధావులారా….
నిరుద్యోగులు, ఉద్యోగస్తుల సమస్యలు, మన ప్రాంతీయ అభివృద్ధి నీళ్లు, నిధులు, నియామకాలు గురించి మనం సాధించుకోవాలంటే డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని గెలిపించాలని.
అంతే గాక డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని శాసనమండలికి పంపినట్లయితే అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకొని మన అమరవీరుల త్యాగాలకు శాంతి కలగాలి అంటే ఖచ్చితంగా ఉద్యమకారుడు అయినటువంటి బహుజనవాది, ప్రజల మనిషి అయిన డాక్టర్ సుధాకర్ గారికి మన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.
హైకోర్టు న్యాయవాది శ్రీనివాస్ యాదవ్ గారు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ గుంతెటి వీరభద్రం గారు, మైనార్టీ నాయకురాలు ఎస్ కే నజీమా, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లిక్కి కృష్ణరావు గారు, పద్మశాలి సంఘం పులిపాటి ప్రసాద్ గారు, కాపు సంఘం జిల్లా నాయకులు తీగల రాము గారు, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు బద్రు నాయక్ గారు, విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు నరేంద్ర గారు, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు కిరణ్ నాయక్ గారు 93 శాతం గల బహుజనుల ప్రతినిధిగా తెలంగాణ ఉద్యమ రథసారథిగా అనేక త్యాగాలు చేసిన డాక్టర్ సుధాకర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ బహుజనుల పైనే ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ కార్యకర్తలు కల్వకుంట్ల లత, వడ్డెబోయిన వెంకటేశ్వర్లు, వడిత్య రాజేష్ నాయక్, ఇరిగి ఉజ్వల, బైరం వరలక్ష్మి, రవీందర్ నాయక్, శ్రీనివాస నాయక్, రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.