గండి కి మద్దతుగా వేగుళ్ళ లీలాకృష్ణ ప్రచారం…
మండపేట:- పట్టణ ప్రజలంతా మార్పు దిశగా ఆలోచన చేసి మునిసిపల్ ఎన్నికల్లో గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి జనసేన పార్టీని గెలిపిస్తే నీతివంతమైన పాలన అందిస్తామని జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు.
శనివారం జనసైనికులతో కలిసి పట్టణంలో 1వ వార్డు అభ్యర్థి గండి రాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వార్డుల్లో ఇంటింటికి వెళ్ళి జనసేనపార్టీ అభ్యర్థి గండి రాజు కు మున్సిపల్ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లీలాకృష్ణ ప్రచారంకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు.
అటువంటి నాయకుడు స్థాపించిన జనసేన పార్టీకి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు.
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది అన్నారు.
ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కుల, మత, వర్గ బేధాలు లేని పార్టీ జనసేన పార్టీ అన్నారు.
ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే మండపేటలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని అన్నారు. ఇప్పటికే ప్రజల్లో మార్పు కనబడిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధులు శెట్టి రవి, నామాల చంద్రరావు, కొంతం నాగేంద్ర ప్రసాద్, గండి వెంకటేశ్వరరావు, లంక రామయ్య, ఆకుల శ్రీవర్ధన్, బండారు సతీష్, సత్తి శ్రీను, పైడమళ్ళ సతీష్, మామిడాల మనోకృష్ణ, కొనాల చంద్రబోస్, వైజయంత్ రాజు, నిమ్మ రమేష్, కొత్తపల్లి కళ్యాణ్, ఏడిద జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.