రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగులు మృతి
ములుగు జిల్లా ములుగు మండలం పందికుంట క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి చెందారు.
నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ కంట్రోలర్ సదానందం , మహిళా కండక్టర్ సునీత ఉద్యోగరీత్యా నర్సంపేట డిపోకు బైకుపై వెళ్తుండగా వెనుకనుండి డీసిఎం ఢీకొట్టడంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.