తిరుమల: హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలంగా ఈ ప్రకటనలో పేర్కొంది.
తిరుమల సప్తగిరుల్లోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలంగా టీటీడీ నిర్థారణకు వచ్చింది.
ఆకాశ గంగా తీర్థం లో పన్నెండేళ్ళపాటు అంజనాదేవి తపస్సు చేసినట్లుగా, నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించారు.
అంజనాద్రి పై వెలసిన జపాలి తీర్థం హనుమంతుని జన్మ స్థలంగా ఈ పరిశోధనలో ఒక నిర్ధారణకు వచ్చారు.
పౌరాణిక వాజ్మయ శాసన చారిత్రిక ఆధారాలను సేకరించి ఈ నిర్ణయానికి వచ్చినల్టు జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధర్ శర్మ తెలియజేసారు.