వరంగల్ అర్బన్ జిల్లా: తేదీ:16th, మార్చి,2021.
వరంగల్ కోర్ట్ కు హాజరైన రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి గారు.
కోర్టులో ఉద్యమకారులను కలసిన మాజీ ఎంపీ సీతారాం నాయక్.
తెలంగాణ ఉద్యమ సమయంలో సుబేధారి పోలీస్ స్టేషన్లో నమోదుయైన CC.NO.600/2013, సంబంధించి డిసెంబర్, 2012లో సర్క్యూట్ గెస్ట్ హౌస్ దారిలో గల YSRCP పార్టీ అఫిస్ పై A1 to A10లు దాడి చేసి ఫర్నిచర్ ద్వంసం చేసారనే కేసుకు సంబంధించి నాల్గోవ అదనపు కోర్ట్ న్యాయాధికారి ముందు పేషీకి నేడు హాజరయ్యారు.
టిఆర్ఎస్ పార్టీ అడ్వకేట్స్, సీనియర్ నాయకులు గుడిమళ్ల రవికుమార్, న్యాయవాదులు మైలగని వసంత్ యాదవ్ మరియు పి.శివ, చల్లా శ్రీనివాస్,మహేష్ పటేల్ ఆధ్వర్యంలో నాటి తెలంగాణ ఉద్యమకారులు నేటి రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి గారు, వారితో పాటు మాజీ కార్పొరేటర్స్ జోరిక రమేష్, బోడ డిన్నా, విద్యార్థి నాయకులు మాచర్ల శరత్, కె. మనోజు, మోడెం ప్రవీణ్, రాజ్ మనోజు, యువజన నాయకులు బి.వీరెందర్, జానీ దర్శన్ సింగ్, సంకు నర్సింగ్, రహమున్నిసా బేగం, కేసులో ఉన్న తదితరులు హాజరయ్యారు.
వరంగల్ 4వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి తదుపరి విచారణ ను ఏప్రిల్ 12th కి వాయిదా వేసారు.
అనంతరం కోర్ట్ క్యాంటీన్లో టీ తాగుతూ నాటి ఉద్యమ సమయంలో చేసిన పోరాటాలను, తీపి గుర్తులను వారందరు ఒకసారి గుర్తుకు చేసుకున్నారు.