22న సర్పంచ్ లకు జూమ్ యాప్ ద్వారా శిక్షణ
శ్రీకాకుళం, ఏప్రిల్ 21: జిల్లాలో సర్పంచులు వార్డు సభ్యులకు గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి తెలిపారు.
శిక్షణా కార్యక్రమం కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ 19వ తేదీన టిఓటి లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
22వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో సర్పంచులకు, వార్డు సభ్యులకు శిక్షణ జరుగుతుందని అన్నారు.
మండలంలో 3 ప్రదేశాల్లో శిక్షణ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ కేంద్రం వద్ద ఒక టి.ఓ.టి తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు.
స్క్రీన్ ఆపరేటింగ్ నిమిత్తం ఒక డిజిటల్ అసిస్టెంట్ ఉండాలని పేర్కొన్నారు.
శిక్షణ కేంద్రంలో 50 మంది మాత్రమే ఉండాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని ఆయన ఆదేశించారు.