దూరం తగ్గుతుందని…..ప్రమాదాన్ని మరచి….!
శ్రీకాకుళం…..సరుబుజ్జిలి మండలంలోని కొత్తకోట పెద్ద చెరువులో దట్టంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. ఈ ఏడాది దీనిలో ఉపాధిహామీ పథకం పని పెట్టారు.
అయితే అందులో ఎక్కువగా నీరు ఉండటంతో దాని ఎగువ భాగంలో పని మొదలు పెట్టారు.
చెరువు గట్టు చుట్టూ తిరిగి వెళ్తే చాలా దూరమవుతుందని ఇలా చెరువు మధ్యలో గుర్రపు డెక్కను పక్కకు తొలగించి సుమారు 300 అడుగుల పొడవులో పని ప్రదేశం వద్దకు నడిచి వెళ్తున్నారు.
గుర్రపు డెక్కలో కూరుకుపోతే ప్రాణాపాయం ఉంటుందని తెలిసినా ఇలా అడ్డదారిలోనే వెళుతూ పలువురు వేతనదారులు శనివారం కనిపించారు.