కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల సాయం
హైదరాబాద్: రాష్టంలో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
కొత్తగా 200 మంది కరోనా సోకిన జర్నలిస్టులకు తక్షణ సాయం అందించనున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజె(H143)), ఇతర జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
