సీఎం శ్రీ కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుంది
తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
సీఎం వ్యక్తిగత వైద్యులు శ్రీ ఎం.వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. సీఎం ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు.
సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి.
సీఎం శ్రీ కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని, త్వరలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు.
సీఎం వెంట మంత్రి శ్రీ కేటీఆర్, ఎంపి శ్రీ జె. సంతోష్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులున్నారు.