ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది …. గండ్ర
ఈ రోజు భూపాలపల్లి, LB నగర్ లోని బైరెడ్డి లక్ష్మారెడ్డి గారి డీలర్ షాప్ నందు ఏర్పాటు చేసిన ప్రైవేట్ టీచర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్‌కి ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయం మరియు బియ్యం పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ…..
కరోనా వ్యాక్సిన్ వచ్చింది, కరోనా తగ్గుముఖం పట్టింది విద్యాసంస్థలు ప్రారంభించుకున్నాం అనుకునే క్రమంలో కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్ళీ విద్యాసంస్థలు మూతపడ్డాయి.
దానితో చిన్నపాటి ఉద్యోగులైన పాఠశాల టీచర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ల కొరకు రాష్ట్ర అభివృద్ధి ప్రధాత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అయ్యే వరకు ఆర్ధిక సహాయం రూ.2000/- మరియు 25 KG ల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి గారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తద్వారా ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని, ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు.
అదే విధముగా విద్యా వాలాంటీర్లకు మరియు కళాశాల లెక్చరర్లకు కూడా ఈ ఆర్ధిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి గారితో చర్చించి వారికి కూడా ఆర్ధిక సహాయం అందేలా చూస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, జిల్లా ముఖ్యనాయకులు, జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్,PACS చైర్మన్, హనుమాన్ టెంపుల్ చైర్మన్, అధికారులు DEO, DSO, MEO, టీచర్స్, మహిళ నాయకులు, మరియు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.