మండపేటలో టీమ్ సురక్ష మెడికల్ క్యాంప్ ప్రారంభం..దాతలు ముందుకు రావాలి..తోట త్రిమూర్తులు…
మండపేట:- కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో దాతల సహకారంతో టీం సురక్ష సభ్యులు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడం చాలా అభినందనీయమని మండపేట వైసిపి నియోజకవర్గ కన్వీనర్
తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
మండపేట 7 వవార్డు పరిధిలోని శ్రీ బాపూజి మునిసిపల్ పాఠశాలలో సోమవారం పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖ, టీమ్ సురక్ష సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని తోట త్రిమూర్తులు ప్రారంభించారు.
తోట మాట్లాడుతూ శిబిరంలో ఉచిత మందులు అందజేసిన వైస్సార్ సిపి నాయకులు గంగుమళ్ల శ్రీనివాస్, ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ సూరంపూడి సత్య ప్రసాద్ లు చాలా అభినందనీయులని అన్నారు.
ప్రతి రోజు మందులు పంపిణీకి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్యం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. లిక్విడ్ సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేస్తున్నామని చెప్పారు.
గత ఏడాది మాదిరి మండపేట టీమ్ సురక్ష పర్యవేక్షణలో దాతల సహాయంతో సచివాలయం పరిధిలో ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
డాక్టర్ ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు.
చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు.
ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, వారి ఆరోగ్య స్థితిగతులను చూడడం తన బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, టీమ్ సురక్ష సభ్యులు, మునిసిపాలిటీ, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.