హారిక ఎవరో తెలియదు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ స్టార్ కంటెంస్టెంట్ దేత్తడి హరిక నియామకం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు.
అయితే ఈ ఉత్తర్వులు రాష్ట్రప్రభుత్వంతో సంప్రదించకుండానే ఆయన ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో సదరు టూరిజం శాఖ మంత్రి కార్పొరేషన్ చైర్మన్‌పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
తాజాగా దీనిపై తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు.