కూలిందో అంతే సంగతులు గతంలో ఇద్దరు మరి ఇప్పుడో?
కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ సన్ షేడ్ వాల్..
అప్రమత్తం కాకపోతే ప్రజల ప్రాణాలకే ముప్పు..
మండపేట: మండపేట పురపాలక సంఘం ఎదురుగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మెట్ల మార్గం పక్కన సన్ షేడ్ వాల్ పడిపోవడానికి సిద్ధంగా ఉంది.
ఏదైనా భారీ వాహనం సన్ షేడ్ వాల్ ను బలంగా ఢీకొట్టి ఉండవచ్చని వ్యాపారస్తులు భావిస్తున్నారు. ప్రతిరోజు వందలాది మంది ప్రజలు, వ్యాపారస్తులు షాపింగ్ కాంప్లెక్స్ కిందనుండి పురపాలక సంఘంనకు చెందిన ఖాళీ స్థలమునకు వెళ్తూ వస్తూ ఉంటారు.
ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి పానీపూరి, స్వీట్స్, పుల్కా లాంటి తోపుడు బండ్లు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అమ్మకాలు సాగిస్తూ ఉంటారు.
వాటిని తినడానికి కొన్ని వందల మంది ప్రజలు, కాలేజీ విద్యార్థులు అక్కడికి వస్తూ ఉంటారు. గతంలో కపిలేశ్వరపురం రోడ్ లోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ సన్ షేడ్ కూలిపోయి ఇద్దరు మహిళలు మృతి చెంది, వందలాదిమంది ప్రజలు గాయాలపాలయారు.
ఆ విషయం మరువకముందే మళ్ళీ అలాంటి సంఘటన జరగకుండా మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ లు సంబంధిత శాఖను అప్రమత్తం చేసి వెంటనే సన్ షేడ్ వాల్ కు మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు, వ్యాపారస్తులు కోరుకుంటున్నారు.
[…] […]