కర్ఫ్యూ నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు
- జిల్లా ఎస్పీ అమిత్ బర్థార్.
శ్రీకాకుళం, మే 27. కర్ఫ్యూ సమయంలో బయటకు రావద్ధుని, కర్ఫ్యూ నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అమిత్ బర్థార్ స్పష్టంచేశారు.
జిల్లాలో కరోనా వైరస్ రెండవ దశ వ్యాప్తి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో వైరస్ అరికట్టేందుకు జిల్లా పోలసు శాఖ తీసుకుంటున్న చర్యలలో భాగంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్థార్ గురువారం నాడు శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్, ఏడు రోడ్లు కూడళ్లలోతో పాటుగా పలు ముఖ్య కూడళ్ళలో కర్ఫ్యూ ఆంక్షలు అమలను స్వయంగా పరిశీలించారు.
ఈ క్రమంలో ఏడు రోడ్లు కూడళ్ల వద్ద కర్ఫ్యూ వేళ అనవసరంగా బయట ప్రాంతాలలో తిరుగుతున్న వహన చోదకులుతో, కరోనా వైరస్ నియంత్రణకు తీసకోవలసిన జాగ్రత్తలు పట్ల ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక అవగాహన కలిపించారు.
ఈ క్రమంలో అత్యవసరాలకే మాత్రమే బయటకు రావాలని, అనవసరంగా బయట ప్రాంతాల్లో తిరగారాదుని సూచించారు.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వ్యవదిలోనే నిత్యావరాలనకు, ఇతరత్రా కార్యకలాపాల కోసం వచ్చేటట్లు ప్రణాళిక ప్రకారం అవసరాలు నిమిత్తం బయటకు రావాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, గుంపులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించాలని,సబ్బు,సానిటైజర్ తో చేతులు పరిశుభ్రంగ చేసుకోవాలనిన్నారు.
ఎటువంటి అవసరమలు లేకుండా బయట ప్రాంతాల్లో తిరుగుతున్న వాహన చోదకులుతో కరోనా వైరస్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్లకార్డులు ప్రదర్శించారు.
ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తి గత జాగ్రతలు తీసుకోవాలని కరోనా వైరస్ నియంత్రణకై విస్తృత అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు, ఎస్ఐలు రమేష్ బాబు, లక్ష్మణరావు పాల్గొన్నారు.