శ్రీకాకుళం నగరం మొత్తం కంటైన్మెంట్ జోన్ గా ప్రకటన
శ్రీకాకుళం ;- కరోనా మహమ్మారి విశ్వరూపం చూపుతున్న వేళ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని జిల్లా కలెక్టర్ జి. నివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఆఙలు మంగళవారం నుండి అమలులోకి రానున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కోవిడ్ కేసులు అధికంగా ఉండడంతో శ్రీకాకుళం నగరం మొత్తం కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.
30 శాతం పైగా పాజిటివ్ కేసులు నగరంలో నమోదు అయిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
ఈ నిషేధ ఆఙలతో రానున్న 14 రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వబడింది.
ప్రజలు, వ్యాపారులు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఈ సందర్భంగా కోరారు.