ఘనంగా కాటన్ దొర 218 వ జయంతి..
మండపేట: సర్ ఆర్దర్ కాటన్ జయంతిని పురస్కరించుకొని తాపేశ్వరం లాకుల వద్ద కాటన్ దొర విగ్రహానికి భారతీయ జనతా పార్టీ మండపేట నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
1852 లో ధవళేశ్వరం వద్ద కట్టిన ఆనకట్ట వలన ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాలు సాగు జరుగుతుందని ఈ సందర్భంగా కోన అన్నారు.
ఉభయగోదావరి జిల్లాలు సస్యశ్యామలం కావడానికి కాటన్ దొర కారణమని అన్నారు. ఆనకట్ట కట్టి 150 సంవత్సరాలు దాటినా చెక్కుచెదరలేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు నాళం ఫణి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.