సంతారి పంచాయతీ వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారం
నిస్వార్థంగా ప్రభుత్వ సేవలను, ప్రజలకు అందించడంలో వలంటీర్లు సహకారం వెలకట్టలేనిదని వారి సేవకు గుర్తింపుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ పురస్కారారు అందిస్తున్నారు.
అందులో భాగంగా, అరకులోయ నియోజకవర్గం హుకుంపేట మండలం, సంతారి పంచాయతీ నుంచి, పెదబురుగుపుట్టు గ్రామ వలంటీర్ వెంకటేశ్వర్లు తోపాటు, 13 మంది వాలంటీర్లకు, సేవా మిత్ర పురస్కారం వరించింది.
పంచాయతీ సర్పంచ్ అప్పలనాయుడు, కార్యదర్శి జిలాని చేతులు మీదుగా, దుశ్శాలువ కప్పి సత్కరించి, వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అప్పలనాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 9 నవరత్నాల్లో గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా వలంటీర్లు ప్రతి గ్రామంలో గడప గడపకు తీసుకు వెళ్లి చేరవేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ పోలీస్ కీర్తి, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.