గ్రామీణ ప్రాంతాల్లోఎన్నికల కోడ్ ఎత్తివేత..
అమరావతి :- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎంసీసీ) ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది.
పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్త య్యాయి.
10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాల ప్రకారం నిలిచిపోయింది.
దానికి సంబంధించి హైకోర్టులో వాదనలు పూర్తయి తీర్పు రిజర్వులో ఉంచారు. హైకోర్టు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే. అప్పుడు కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ని ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.