స్టేట్ బ్యాంకు వినియోగదారులకు కరోనా కవచ్ రుణాలు
యస్.బి.ఐ మాడ్యుల్ డెప్యూటీ జనరల్ మేనేజర్ రంగరాజన్
శ్రీకాకుళం, జూన్ 16 : దేశంలోనే ప్రప్రధమంగా కరోనా బారిన పడిన స్టేట్ బ్యాంక్ వినియోగదారులకు కరోనా కవచ్ పేరిట వ్యక్తిగత రుణాలను మంజూరుచేస్తున్నట్లు విశాఖపట్నం యస్.బి.ఐ మాడ్యుల్ డెప్యూటీ జనరల్ మేనేజర్ రంగరాజన్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన జారీచేసారు. 2021 ఏప్రిల్ 1 తరువాత కరోనా బారిన పడిన స్టేట్ బ్యాంక్ వినియోగదారులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా కరోనా కవచ్ వ్యక్తిగత రుణాలను పొందవచ్చని చెప్పారు.
ఈ రుణాన్ని అన్ని స్టేట్ బ్యాంకు బ్రాంచులలో పొందవచ్చని స్పష్టం చేసారు. కావున కరోనా బారిన పడిన వినియోగదారులు, కుటుంబసభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.