పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన :- రూరల్ సిఐ సతీష్
కంచికచర్ల మండలం కునికిన పాడు గ్రామంలో గురువారం రాత్రి నందిగామ రూరల్ సీఐ సతీష్ వారి సిబ్బందితో కలిసి పల్లెనిద్ర చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ మరియు నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కునికిన పాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు.
రూరల్ పరిధిలోని కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయనట్లు వివరించారు.
ప్రజలు కూడా చైతన్యవంతులు అయ్యి పోలీసువారికి సహకరించారని, ఎటువంటి దాడులు ప్రతి దాడులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.
కాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని సమస్యాత్మకమైన గ్రామాల్లో అలజడులు సృష్టించే వారిని అదుపు చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.
గురువారం రాత్రి కునికిన పాడు గ్రామంలో తాగునీరు పైప్ లైన్ విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, ఇక్కడకు చేరుకొని అదుపులోకి తీసుకు రావడం జరిగిందని తెలిపారు.
తదనంతరం గ్రామస్తులకు అవగాహన కల్పించమని తెలిపారు.
పల్లెలు అంటే ప్రశాంతతకు మారుపేరు అని, అలాంటి పల్లెలలో క్షణికావేశంతో ఒకరినొకరు ద్వేషించుకొంటూ, దాడులు ప్రతి దాడులకు దిగటం మంచి పద్ధతి కాదని, ఇటువంటి గొడవలను ప్రేరేపించే వారిని ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోమవారం, 12 ఏప్రిల్ 2021: రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్దంగా వుండండి – గెలుపు తెలుగుదేశం పార్టీదే – రాజమండ్రి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో శాసనసభ్యులు శ్రీ గోరంట్ల పిలుపు. రాజమండ్రి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నేడు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గృహంలో శ్రీ గోరంట్ల అధ్యక్షతన జరిగింది.…
22న సర్పంచ్ లకు జూమ్ యాప్ ద్వారా శిక్షణ శ్రీకాకుళం, ఏప్రిల్ 21: జిల్లాలో సర్పంచులు వార్డు సభ్యులకు గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి తెలిపారు. శిక్షణా కార్యక్రమం కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ 19వ తేదీన టిఓటి లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని…
తొమ్మిది మంది వాలంటీర్లు తొలగింపు శ్రీకాకుళం, మే 16 : జిల్లాలో చేపట్టిన ఆరో విడత ఫీవర్ సర్వే లో నిర్లక్ష్యం వహించిన తొమ్మిది మంది వాలంటీర్లను తొలగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఫీవర్ సర్వేలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి అన్ని తప్పులు తడకల రిపోర్టులను సమర్పించారని ఆయన తెలిపారు. తొలగించిన తొమ్మిదిమంది వాలంటీర్ల వివరాలు:…