రెమిడిసివేర్, ఆక్సిజన్, ఫీజులు వంటి అంశాలపై నిఘా
డిజిపి కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్:
రెమిడిసివేర్ నిల్వలు – వినియోగం, ఆక్సిజన్ నిల్వలు – వినియోగం, ఫీజుల పేరిట దోపిడీ మొదలైన పలు అంశాలపై నిరంతర నిఘా: డిజిపి
రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారిపై ఉక్కుపాదం :డిజిపి
జిల్లా పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోల్ మరియు మెడికల్ అండ్ హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు: డిజిపి
రెమెడిసివేర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలెండర్లు బ్లాక్ మార్కెట్లలో అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కు, 1902 కు ఫోన్ చేయండి: డిజిపి
కోవిడ్ రోగుల నుండి ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజు లపై ఆరా తీస్తున్నాం. పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డిజిపి అన్నారు. అట్టి సమాచారాన్ని డయల్ 100, 1902 ద్వారా చేరవేయాలని కోరారు.
ఆక్సిజన్ వాహనాలకు రవాణా పరమైన ఇబ్బందులు కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందు కోసం రాష్ట్ర స్థాయి మరియూ జిల్లా స్థాయి నోడల్ ఆఫీకారులు నియమించినట్లు ఆయన తెలిపారు.
ఇతర శాఖలతో సమన్వయం కొరకు కోవిడ్ కంట్రోల్ రూమ్ లో ఇద్దరు ఐపీఎస్ అధికారుల నియామించినట్లు తెలిపారు.
కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని డీజీపీ హితవు పలికారు.
మాస్క్ ధరించక పోతే జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు.
రాత్రి పూట కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
సామాజిక మాధ్యమాల్లో కరోనా పై అవాస్తవాలు, పుకార్లను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కోవిడ్ ఆసుపత్రులపై సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలు వ్యాపింప చేస్తున్నారని. ఇటువంటి శక్తులపైనా నిఘా ఉంచుతామని, ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తో వ్యవహరించాలి డీజీపీ కోరారు.