గుంటూరు జిల్లాలో కరోనా కలకలం
తాడేపల్లి మండలంలో 25 కు చేరుకున్న కరోనా పాజిటివ్ లు
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ లలో 45 శాతం తాడేపల్లి మండలంలో నే ఉండటంతో కొంత ఆందోళన
ఈ పదిహేను రోజుల్లోనే కరోనా కేసులు పెరగటంతో అప్రమత్తమైన అధికారులు
తాహశిల్దార్ కార్యాలయంలో అత్యవసర సమావేశం అయిన అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు
అధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
కరోనాపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రజల్ని అప్రమత్తం చేయడం
బహిరంగ ప్రదేశాల్లో సినిమా హాళ్ల దగ్గర మాస్కులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవడం
కరోనా దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో ఫంక్షన్ హాల్స్ లో జరిగే కార్యక్రమాలలో తగినంత భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటేషన్ వంటివి ప్రజలు ఉపయోగించేలా నిర్వాహకులే చూసుకోవాలి
కరోనా నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు
తాడేపల్లి మండల పరిధిలో కరోనా పాజిటివ్ లు వచ్చిన ఏరియాలు అన్ని మినీ కంటోన్మెంట్ జోన్ గా పరిగణలోకి తీసుకుని నిరంతరం వైద్య అధికారులతో పర్యవేక్షిస్తామని తెలిపిన తాహశిల్దార్ శ్రీనివాస్ రెడ్డి