కోవిడ్ సాకుతో అధిక ఫీజులు వసూలు చేస్తే అరెస్టే
అనంతపురం: కోవిడ్ సాకుతో అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపై ఎస్పీ సత్యయేసుబాబు కొరడా జళిపించారు.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన నిబంధనలు అతిక్రమించిన వారిన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు.
ఈ క్రమంలోనే ఒక్కో కోవిడ్ రోగి నుంచి రోజుకు 25000 వసూలు చేస్తున్న ఎస్వీ హాస్పిటల్ ఎండీ రవిబాబును కూడా అరెస్ట్ చేశారు ఎస్పీ సత్యయేసుబాబు.
ఎస్వీ హాస్పిటల్ ఎండీ రవిబాబు పై 188, 406, 420, 53 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని, కరోనా పేరుతో దోపిడీ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సత్యయేసుబాబు ఈ సందర్భంగా ప్రవేటు ఆస్పత్రుల యాజమాన్యాలను. హెచ్చరించారు.