మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం
విధినిర్వహణలో ఆకస్మాతుగా మరణించిన పోలీసుల కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
అకస్మాత్తుగా మరణించిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
వరంగల్ పోలీస్ కమినషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ గత సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించారు.
హెడ్ కానిస్టేబుల్ యం. నర్సింగరావు కుటుంబానికి చేయూత పథకంగా పోలీసు కమిషనర్ చేతుల మీదుగా లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
అంతేగాక ఆరోగ్య భద్రత క్రింద మంజూరైన నాలుగు లక్షల రూపాయల చెక్కును పోలీస్ కమిషనర్ మరణించిన హెడ్ కానిస్టేబుల్ సతీమణి రోజారాణి అతని పిల్లలు రాహుల వర్ణన్, అముక్త మాల్యదకు అందజేశారు.
ఈ సందర్భంగా మరణించిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం తరుపున అందాల్సి బకాయిలను త్వరితగతిన అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల అశోక్ కుమార్ కోరారు.