గుంపులుగా జనం, ఇలా అయితే కరోనా కట్టడి ఎలా?
రావులపాలెంలో మీసేవ ఆధార్ దగ్గర గుంపులుగా జనం..
ఏ మాత్రం భయం లేకుండా ప్రవరిస్తున్న ప్రజలు..
రావులపాలెం., కరోనా విజృంభించి ఎంతో మంది మృత్యువాత పడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు కానరావడం లేదు అనడానికి ఈ ఫోటోనే ఉదాహరణ.
రావులపాలెం తహశీల్ధార్ కార్యాలయం క్రింద ఉన్న మీ సేవ ఆధార్ సెంటర్ వద్ద సోమవారం నెలకొన్న పరిస్థితి ఇది. భౌతిక దూరం అనే మాటే లేదు.
మీ సేవ దగ్గర గుంపులుగా నిలబడి ఉన్న ఈ జనాన్ని చూస్తుంటే కనీసం వారికి టోకెన్లు ఇచ్చి క్రమ పద్ధతిలో పిలవడం గాని, వారిని భౌతిక దూరం పాటించేలా అదుపు చేసే చర్యలు గాని మీసేవ ఆధార్ సెంటర్ వారు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రకటనల్లో ఊదరగొడుతున్న అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం.
క్షేత్ర స్థాయిలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయకపోతే కరోనా ఎలా కట్టడి అవుతుందని, ఇలా నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత జటిలం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అధికారులు విషయం కాసేపు పక్కన పెడితే, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ఆయినా ప్రతీ వ్యక్తీ తమ తమ విధిగా కోవిడ్ నియమాలు పాటించకపోతే ఈ మహమ్మారిని తరిమికొట్టం ఎలా?
పట్టించుకునే వాడు లేనప్పుడు ఎలా అయినా ఉండవచ్చు అన్నట్లు వ్యవహరించకుండా, ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే అసలు సమస్యే ఉండదు కదా!