మనుబోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తిరుపతి ఎంపీ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాక్రిష్ణారెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
భారీగా పెరిగిన ధరలను వివరిస్తూ ప్రజల్లో కలిసిపోయి వినూత్నంగా ప్రచారంలో దూసుకుపోతున్న పనబాకకు ఘనస్వాగతం పలికి బ్రహ్మరథం పట్టిన మనుబోలు ప్రజానీకం..
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ,
“నాలుగు సార్లు ఎంపీగా, 10 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన మచ్చలేని మన కోట ఆడపడుచు పనబాక లక్ష్మి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు..
పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డికి కాళ్లు నొప్పులు, వళ్లు నొప్పులు సరిచేసిన పిల్లోడికి వైసీపీ అవకాశం ఇచ్చింది..
ఎవరికి ఓట్లు వేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలి అన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పామాయిల్ లీటర్ రూ.75 ఉంటే ఈ రోజు రూ.160కి పెరిగిందని.
ఏట్లో దొరికే ఇసుక ట్రక్కు అప్పట్లో వెయ్యి, రూ.1200 ఉంటే ఇప్పుడు రూ.6 వేలు నుంచి రూ.7 వేలకు చేరిందని ఎద్దేవా చేసారు.
ట్రాక్టర్ బాడుగ 1200 పోతే మిగిలిన 5 వేలు ఎవరి జేబులోకి పోతున్నాయని ప్రశ్నించారు.
తెలుగుదేశం పాలనలో మీరు కోరిన మద్యం బ్రాండ్ల ధర ఎంతో…ఈ రోజు ఎంతో అవి తాగే అన్నదమ్ములకే తెలుసునన్నారు.
రాత్రి 8 గంటలు దాటగానే ప్రభుత్వ దుకాణాలు మూతపడగానే పక్కనే ఉన్న బెల్టు దుకాణం తెరుచుకుంటుందని, సీసాకు రూ.50 కమీషన్ తీసుకుని తెల్లవార్లూ మద్యం అమ్ముతున్నారని, రూ.50 ఎవరి బీరువాలోకి చేరుతోందని విమర్శించారు.
15 వేల ఎకరాలకు నీరు అందించే డేగపూడి- బండేపల్లి కాలువ నిర్మాణం మనుబోలు మండల రైతుల 30 ఏళ్ల కల అని, ఆ కలను సాకారం చేస్తూ నిధులు తెచ్చి 11 శాతం లెస్ తో కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తే వైసీపీ అధికారంలోకి రాగానే తోడేరు పెద్దరెడ్డి ఆపించేశారన్నారు.
అదేమంటే చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ విధానంలో పని అప్పగించారని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.
టెండర్ ప్రక్రియలో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి చెందిన కంపెనీ 11 శాతం లెస్ తో పనులు చేపట్టి మొదలుపెట్టిన విషయం వాస్తవం కాదా అన్నారు.
వైసీపీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్ ను మన పెద్దరెడ్డి 10 శాతం కమీషన్ అడగడంతో ఇవ్వలేక పనులు వదిలేసిపోయిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు.
పొదలకూరు మండలంలో 10 వేల ఎకరాలకు నీరు అందించే సోమశిల దక్షిణ కాలువ పనులు జరుగుతుంటే ఆపించేశారన్నారు.
పొదలకూరు మండల ప్రజలకు లీటర్ 10 పైసలకే మినరల్ వాటర్ అందించేందుకు రూ.4.69 కోట్లతో మెగా మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తే దానిని మూలనపెట్టేశారు అన్నారు.
అసలు ఈ నియోజకవర్గాన్ని ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా కంఠంలో ప్రాణం ఉండగా ప్రభగిరిపట్నం కొండలపై బండ కూడా కదలదన్నారు…అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఏకంగా కొండలే లేపేశారని ఆరోపించారు.
విరువూరు ఇసుక నుంచి పవర్ ప్రాజెక్టులోని బూడిద వరకు ఏదీ వదిలిపెట్టడం లేదని ఎద్దేవా చేశారు.
చివరకు కరోనా వస్తే.. ఇంటి పక్కన ఏకంగా భారీ మిద్దె లేస్తోందని అన్నాారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ నాయకులు రూ.500 లెక్కన పంచాలని నిర్ణయించుకున్నారని ఇసుకలో వాటాగా వచ్చిన ఆదాయంలో సగం ఖర్చు పెట్టినా ఒక్కొక్కరికి రూ.10 వేలు లెక్కన వస్తుందని ఆయన ఆరోపించారు.
పేదల కడుపుకొట్టి వందల కోట్లు సంపాదిస్తున్నారని కొంచెమైనా బయటకు తీయండి అన్నారు.
నేను ఓడిపోయినా మనుబోలు మండలంలో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేశానని అన్నారు.
కండలేరు లోలెవల్ స్లూయీజ్ కింద మనుబోలు మండలానికి 1.47 టీఎంసీలుగా ఉన్న కేటాయింపులను 2.5 టీఎంసీలకు పెంచానని అన్నారు.
మిట్టకాలువ కింద నీళ్లు పారక నిమ్మతోటలు, పంటలు ఎండిపోతుంటే 25 వేల ఎకరాలకు నీళ్లు అందించేందుకు రూ.63 కోట్లతో కండలేరు ఎడమకాలువ లిఫ్ట్ తెచ్చానన్నారు.
ఎమ్మెల్యే సొంత మండలమే కాదు, ఆయన సొంతూరు తోడేరు చెరువుకు కూడా నీళ్లిచ్చి పంటలు పండించానన్నారు.
జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు…అప్పటి మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పక్కనే ఉన్నారు..శాశ్వతంగా నిలిచిపోయే పనులు ఏం చేశారు..
ప్రజలందరూ ఆలోచించి ఓటు విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా అంటూ…పనిచేసే లక్ష్మిగా గుర్తింపు పొందిన పనబాక లక్ష్మిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ ప్రజలను కోరారు.