డిసెంబర్ నాటికి మరో 70,719 మందికి మేకలు, గొర్రెలు
వైయస్ఆర్ ఆసరా, చేయూత, జగనన్న తోడుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
వాలంటీర్లకు సత్కారం
తాడేపల్లి: డిసెంబర్ నాటికి సుమారు మరో 70,719 మందికి మేకలు, గొర్రెలు పంపిణీ చేయాలని సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
గురువారం వైయస్ఆర్ ఆసరా, చేయూత, జగనన్న తోడు కార్యక్రమాల పనితీరుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
ప్రతి నెలా 5 వేల మందికి మేకలు, గొర్రెలు అందజేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు.
జగనన్న తోడు పథకం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరు అయ్యేలా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లదేనని సీఎం పోర్కొన్నారు.
వాలంటీర్లకు సత్కారంపైనా ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
అర్హత ప్రకారం మూడు కేటగిరీలుగా వాలంటీర్ల ఎంపిక జరిగేలా దిశా నిర్దేశం చేశారు.
లెవల్ 1లో ఏడాది పాటు సేవలందించిన వాలంటీర్ల పేర్లు పరిశీలించాలని, వీరికి సేవా మిత్రతో పాటు బ్యాడ్జి, రూ.10 వేలు నగదు పురస్కారం అందించాలని పేర్కొన్నారు.
లెవల్2లో ప్రతి మండలం లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున ఎంపిక చేసిసి, వీరికి సేవా రత్నతో పాటు స్పెషల్ బ్యాడ్జి, రూ.20 వేలు నగదు పురస్కారం అందజేయనున్నారు.
లెవల్ 3లొ ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున ఎంపిక. వీరికి సేవా వజ్రాల పేరిట స్పెషల్ బ్యాడ్జితో పాటు మెడల్, రూ.30 వేల నగదు అందజేయాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.