రక్తసంబంధీకులు కూడా చేయలేని సేవలందిస్తున్నారు
శ్రీకాకుళం: అంతర్జాతీయ నర్సు దినోత్స్వం సందర్భంగా కలెక్టర్ జే.నివాస్ జెమ్స్ హాస్పటల్లో జరిగిన వేడుకలో పాల్గొని ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ, ప్రస్థుతం కరోనా సెకండ్ వేవ్ త్రీవ్రంగా ఉందని, అయినా భయపడకుండా నర్సులు కరోనా రోగులకు చేస్తున్న సేవలు ఆమోఘమని కొనియాడారు.
కరోనా సోకిన వారి దగ్గరకి వారి బంధువులే చేరడం లేదు, కానీ వారికి అమ్మలా, చెల్లిలా, అక్కలా, కూతురులా సేవలు అందిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని అక్కడి నర్సులనుద్దేశించి అన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది, డాక్టర్ హేమంత్, డాక్టర్ ప్రవీణ్ ఆర్ఎంఓ డాక్టర్ జ్యోత్స్న, సతీయహ్ తదితరులు పాల్గొన్నారు.