ఖమ్మం జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ పటిష్టంగా అమల్లో ఉంటుంది -జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఖమ్మం
ఖమ్మం జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ పటిష్టంగా అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఒక ప్రకటనలో తెలియజేసారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో రాత్రిపూట పటిష్టంగా అమలు చేస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో అత్యవసర సేవలైన ఆస్పత్రులు డయాగ్నస్టిక్ సెంటర్ లు వంటి వాటికి మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇతర వాణిజ్య వ్యాపార సంస్థలు విధిగా ఎనిమిది గంటలకల్లా మూసివేయాలన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ 30 వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలియజేశారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్నెట్ సేవలు గిడ్డంగులు విద్యుత్ శాఖ వంటి వాటికి హాస్పిటల్ లో పని చేసే వారు తమ ఐడీ కార్డు వెంట ఉంచుకోవాలి అని తెలిపారు.
