అకారణంగా మా నాన్నని అరెస్ట్ చేశారు
ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై ఆయన కుమారుడు భారత్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకారణంగా మా నాన్నని అరెస్ట్ చేశారు అన్నారు.
మధ్యాహ్నం 3.30కి 30మంది పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి బలవంతంగా వచ్చి తన తండ్రిని లాక్కుని వెళ్లిపోయారని ఆయన తెలిపారు.
4నెలల క్రితం మా నాన్నకు బైపాస్ జరిగింది అని ఆయన అన్నారు. ఓ ఎంపీని 30మంది పోలీసులు సీఆర్పీఎఫ్ సిబ్బందిని నెట్టేసి తీసుకుపోయారని ఆయన దుయ్యబట్టారు.
మా నాన్నని ఎక్కడికి తీసుకు వెళ్లారో తెలీదు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, పోలీసుల దగ్గర వారెంట్ కూడా లేదు అని రఘురామకృష్ణంరాజు కుమారుడు అన్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు రఘు రామ కృష్ణంరాజు పుట్టిన రోజు కావడం గమనార్హం.
