17న సీఎంలతో ప్రధాని సమావేశం… దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారా?
ఇండియాలో కరోనా ఏ రేంజ్లో పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం.
ఇలాగే ఊరుకుంటే కొంపలు మునుగుతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా 17న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మధ్యాహ్నం 12.30కి జరగనుంది.
ఇందులో రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో మోదీ తెలుసుకోనున్నారు. ఏం చెయ్యాలో చెప్పనున్నారు. ఈ సందర్భంగా… మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్లు ప్రకటించమని సూచించే అవకాశాలు ఉన్నాయి.