కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు
మండపేట: ప్రతి ఒక్కరు అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకుంటేనే కరోనాను పూర్తిగా దూరం చేయవచ్చని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు.
మండపేట పట్టణంలో డొక్కా సీతమ్మ భవనం నందు గురువారం ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావ పరిశీలించారు.
45 సంవత్సరములు పూర్తి అయిన వారికి ప్రభుత్వం వారు వేస్తున్న కోవిషీల్డ్ మొదటి డోసు వ్యాక్షిన్ వేయించుకొనుటకు వస్తున్న ప్రజలకు కోవిడ్ సెంటర్ వద్ద చేసిన ఏర్పాట్లుపై ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకొనుటకు భయపడుచున్నారని, భయపడనవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు.
ప్రస్తుతం 45 సంవత్సరాలు పూర్తయిన వారికి మొదటి డోస్ వేస్తున్నందున తమ పేర్లును వాలంటీర్ల ద్వారా కాని లేదా వారే స్వయంగా సంబంధిత సచివాలయాలలో కాని నమోదుచేయించుకోవలసినదిగా తెలియజేసారు.
ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు ఉంగరాల రాంబాబు పాల్గొన్నారు.