మండపేట గెలుపు చరిత్రాత్మకం…
అనపర్తి ఎమ్మెల్యే అభినందనలు…
మండపేట:- మండపేట మునిసిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఓ చరిత్రాత్మక ఘటనగా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు.
మండపేట మునిసిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో సోమవారం ఆయన మండపేట విచ్చేశారు.
కెపి రోడ్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండపేట ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులుతో భేటి అయ్యారు.
అనంతరం గెలుపు సాధ్యం చేసిన తోట త్రిమూర్తులు, వైఎస్సార్సీపీ నేతలు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణలను శాలువాలతో సత్కరించారు.
విజయం సాధిచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.
ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పధకాలే ఈ ఫలితాలకు నిదర్శనమైతే మండపేటలో జగన్కు తోడు తోట హవా జత కలిసి ఇంతటి విజయానికి కారణంగా పేర్కొన్నారు.
తోట మాట్లాడుతూ ఈ విజయం కార్యకర్తలకు అంకితమని పేర్కొన్నారు.
ఎలాంటి పొరపచ్చాలు లేకుండా అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే విజయం దక్కిందన్నారు.
పట్టణంలో అన్ని వర్గాల వారు తమవెంట నడిచి తమను నమ్మి ఓట్లు వేసారన్నారు.
వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.