సోమవారం, 12 ఏప్రిల్ 2021: రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్దంగా వుండండి – గెలుపు తెలుగుదేశం పార్టీదే – రాజమండ్రి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో శాసనసభ్యులు శ్రీ గోరంట్ల పిలుపు.
రాజమండ్రి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నేడు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గృహంలో శ్రీ గోరంట్ల అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ గోరంట్ల మాట్లాడుతూ మున్సిపల్ కార్పోరేషన్ ను 52 డివిజన్లు గా విభజించడం అశాస్త్రీయమని , సరైన విధి విధానాలు పాటించలేదని, 2011 ఓటర్ లిస్టు ప్రకారం విభజన జరిగిందని అనేకమంది యువకులు దీనివల్ల వోటు హక్కును కోల్పోతారని ఆయన అన్నారు.
అంతే గాకుండా ప్రభుత్వo సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నామని చెబుతూ దొడ్డిదారిన అనేక విధాలుగా తిరిగి లాక్కొంటూ మోసంచేస్తున్నారని, ప్రజలు ఈ ప్రభుత్వ చర్యలను గమనిస్తున్నారని వీరికి త్వరలోనే తగిన బుద్ది చెబుతారని అయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యోన్ముఖులై ఈ ప్రభుత్వ మోసపూరిత విధానాల పట్ల ప్రజలను జాగృతం చేయాలని అయన అన్నారు.
రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ కు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు, నాయకులూ సిద్ధంగా వుండాలని కోర్పోరేషణ్ ఎన్నికలలో చరిత్రను పునరావృతం చేయాలని అయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూరల్ మండల TDP అడ్- హక్ కమిటీ ని శ్రీ మత్సేటి సత్యప్రసాద్ కన్వీనర్ గా నియమిస్తూ ప్రకటన చేసారు.
ఈ సమావేశంలో శ్రీయుతులు గంగిన హనుమంతురావు, మత్సేటి సత్యప్రసాద్, పుక్కళ్ళ సత్తిబాబు , రేలంగి వీర వెంకట సత్యనారాయణ , పిన్నింటి ఏకబాబు , ఆళ్ళ ఆనంద రావు, దండమూడి సత్య ప్రసాద్ , యర్రమోతు ధర్మరాజు ,
నిమ్మలపుడి రామకృష్ణ, కామిని ప్రసాద్ చౌదరి , తలారి మూర్తి అడ్వకేట్ సింగ్ సురేంద్ర ప్రసాద్ , మన్యం పెదబాబు , దార అన్నవరం , బొప్పన నాగేశ్వర రావు , మార్ని దొరబ్బాయి, భీమరసెట్టి రమేష్, MSR శ్రీను , ముసిని శ్రీను, కోటి , లలిత,
పిల్లా తనూజ , గోకా శ్రీను , బిక్కిన సాంబశివరావు, మేక సత్యనారాయణ, బత్తిన బ్రదర్స్ , రుఖియ సయ్యద్ మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు