జాతీయ ఛాంపియన్ తెలంగాణ ఫిస్ట్ బాల్ టీం కు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు
మార్చి 26 నుంచి 29 వరకు తమిళ నాడులో జరిగిన 4వ జాతీయ స్థాయి ఫిస్ట్ బాల్ లో ఘన విజయం
ఛాంపియన్స్ టీమ్ లో నలుగురు మంత్రి నియోజకవర్గం పాలకుర్తి మండలం చెన్నూరు కు చెందిన వారే
మహబూబాబాద్ నుంచి ముగ్గురు, హైదరాబాద్ నుంచి ముగ్గురు
క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించి, ఆశీర్వదించిన దయాకర్ రావు
హైదరాబాద్, మార్చి 31:
మార్చి 26 నుంచి 29 వరకు తమిళ నాడులో జరిగిన 4వ జాతీయ స్థాయి ఫిస్ట్ బాల్ లో ఛాంపియన్స్ గా నిలిచిన తెలంగాణ జట్టును రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.
వారి క్రీడా నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. భవిష్యత్తులోనూ మంచి క్రీడా స్ఫూర్తి తో మెలగాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
కాగా జాతీయ జట్టులో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన నలుగురు ఆటగాళ్ళు ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే మహబూబాబాద్ జిల్లా నుంచి ముగ్గురు, హైదారాబాద్ నుంచి ముగ్గురు ఉండటం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
కాగా, సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు, క్రీడాకారులకు మంచి ఆదరణ లభిస్తున్నది అన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సీఎం అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
బాగా రాణించాలని క్రీడాకారులకు సూచించారు. ఒక్కొక్క క్రీడాకారుడితో ఒక్కో ఫోటో దిగి వారిని ఉత్సాహపరిచారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర టీంలో ఒక్క పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరు గ్రామం నుంచే నలుగురు క్రీడాకారులు ఉన్నారు.
వీరిలో బాలబోయిన సందీప్, జోడు సంతోష్, రావుల కుమార స్వామి, దొంతమల్ల గణేశ్ లు ఉండగా, మహబూబాబాద్ జిల్లా అమనగల్లు గుండాల గడ్డ తండాకు చెందిన లునావత్ సంతోష్ కెప్టెన్ గా, మహేందర్ లునావత్, శ్రీకాంత్ లు టీమ్ సభ్యులుగా ఉన్నారు.
అలాగే, హైదరాబాద్ కు చెందిన మండల ఆనంద్, రాహుల్, రాజేశ్ లు టీమ్ సభ్యులుగా ఉన్నారు.
కాగా, తెలంగాణ స్టేట్ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మండలి విజయ్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము వెంకట్ తదితరుల ప్రోత్సాహంతో తాము ఎదిగామని, వాళ్లకు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి క్రీడాకారులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.