మాజీ ఎమ్మెల్సీ గొండు మృతికి డిప్యూటీ సీఎం సంతాపం
శ్రీకాకుళం :మాజీ ఎమ్మెల్సీ గొండు నర్సింగరావు మృతి పట్ల డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
జిల్లాలో ప్రజా నాయకుడిగా అనేక సేవలు అందించిన ప్రముఖ వ్యక్తిగా పెద్దల సభకు వన్నె తెచ్చిన వ్యక్తిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
గత ఏడాదే ఆయన జన్మదిన వేడుకలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న క్షణాలను గుర్తు చేసుకున్నారు.
తమ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఉన్న నర్సింగరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని కృష్ణదాస్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.